ఇండోనేషియాలో వింత శిశువు జననం...ఒకే మొండానికి రెండు తలలు

సోమవారం, 15 ఆగస్టు 2016 (08:45 IST)
జన్యుపరమైన లోపాలతో వింత శిశువులు జన్మించడం తరచూ వార్తల్లో వినిపించేదే.  కొందరు అవయవ లోపంతో జన్మిస్తే, మరికొందరు చిన్నారులు అదనపు అవయవాలతో జన్మిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్‌లో గ్రెసిక్‌లోని ఇబును సినా జనరల్ ఆస్పత్రిలో ఒక మహిళ ఇటీవలే ఓ వింత ఆడశిశువుకు జన్మనిచ్చింది.
 
తనకు పుట్టిన శిశువును చూసి తనతో పాటు వైద్యులు కూడా నివ్వెరపోయారు. ఆ పాప మొండానికి రెండు తలలు, రెండు చేతులు, రెండు కాళ్లతో జన్మించింది. వైద్య చరిత్రలో ఇదొక వింతని నిపుణులు అంటున్నారు. ఈ వింతశిశువును వైద్యులు ప్రస్తుతం ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 4.2 కేజీల బరువున్న ఈ శిశువు అప్పడప్పుడు ఏడుస్తోంది.
 
 పారాపాగస్(ఒకే మొండానికి రెండు తలలు) శిశువులు జన్మించడం చాలా అరుదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ శిశువు వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఈ వింతశిశువు గురించి సమాచారం అందుకున్న స్థానికులు చిన్నారిని వీక్షించేందుకు ఆస్పత్రికి పోటెత్తుతున్నారు. అయితే వైద్యులు వారిని అనుమతించడం లేదు.  

వెబ్దునియా పై చదవండి