యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్షలను అమలు చేశారు. ఇటీవలే భారతీయ మహిళను ఓ కేసులో ముద్దాయిగా తేలించి ఉరితీసిన విషయం తెల్సిందే. తాజాగా మరో ఇద్దరు కేరళ రాష్ట్రానికి చెందిన వారిని ఉరితీశారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని కూడా మృతుల కుటుంబ సభ్యులకు వెల్లడించింది. మృతులను కేరళ రాష్ట్రానికి చెందిన మహ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్, పెరుమ్తట్టు వలప్పిల్‌గా గుర్తించారు.
ఒక యూఏఈ వాసి హత్య కేసులో మహ్మద్ నివాష్ అరింగిలొట్టు, ఓ భారతీయుడు హత్య కేసులో మురళీధరన్‌ను యూఏఈ కోర్టు దోషిగా తేల్చింది. వీరిద్దరికి యూఏఈ ఉరిశిక్షను అమలు చేసింది. వీరికి అవసరమైన దౌత్య సాయం అదించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది.
యూఏఈ జైల్లో ఉన్న భారతీయ మహిళ షెహజాది ఖాన్‌ను ఇటీవల ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెల్సిందే. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారి హత్య కేసులో ఆమెకు ఈ శిక్షను విధించారు. షెహజాది ఖాన్ యేడాది పాటు న్యాయపోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో గత నెల 15వ తేదీన ఆమెను ఉరితీసి, సమాచారాన్ని విదేశాంగ శాఖ దౌత్యాధికారులకు సమాచారం చేరవేశారు.