అయితే, సిరియాలో తిరుగుబాటు శిబిరాలపై రసాయన దాడుల పాపం ఆ దేశ అధ్యక్షుడు చేసిన పనేనని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సిరియా వైమానిక స్థావరాలపై క్షిపణులతో అమెరికా విరుచుకుపడుతోంది. సిరియా అధ్యక్షుడి నేతృత్వంలో నడిచే ఈ వైమానిక స్థావరం నుంచే రసాయన దాడులు జరగడం గమనార్హం.
కాగా ఈ క్షిపణి దాడుల్లో ఎంత మంది చనిపోయారు, ఎలాంటి నష్టం జరిగిందన్న దానిపై వివరాలు రావాల్సి ఉంది. గత మూడు రోజుల క్రితం తిరుగుబాటు దారులపై సిరియాలో జరిగిన రసాయన దాడిపై అసద్‌ను తప్పు పట్టిన మరుసటి రోజే ట్రంప్ క్షిపణి దాడులకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.