కీవ్‌‍లో వైమానిక దాడులు.. సైరన్ మోగించిన రష్యా సైనికులు

మంగళవారం, 1 మార్చి 2022 (07:39 IST)
kyiv
ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరమైన కీవ్‌‍లో వైమానిక దాడులు చేస్తున్నామని.. ప్రజలు నగరాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ సోమవారం నాడు రష్యా సైనికులు సైరెన్ మోగించారు.  
 
ఇప్పటికే జరిగిన విధ్వంసంతో కీవ్ నగరంలో అనేక భవంతులు పాక్షికంగా నేలమట్టం అయ్యాయి. నగరంలోని దక్షిణ ప్రాంతంలో ఇంకా కొందరు ప్రజలు నివసిస్తున్నారు. ప్రజలు సమీపంలోని బాంబు షెల్టర్లలో తలదాచుకోవాలని, లేదంటే నగరం నుంచి వెళ్లిపోవాలని రష్యా సైనికులు హెచ్చరించారు. 
 
ఇదిలా ఉంటే..కీవ్ నగరాన్ని రష్యా సైనికులు పూర్తిగా ఆక్రమించుకోవడంతో అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నగరాన్ని సందర్శించినట్లు వార్తలు వెలువడ్డాయి. 
 
మరోవైపు కీవ్ నగరాన్ని ఆక్రమించుకోవాలన్న రష్యా సైనికుల ప్రయత్నాలు విఫలమయ్యాయని యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు