భార్యను ప్రసవం కోసం భారత్‌కు పంపించి.. నిద్రలోనే భర్త తిరిగిరాని లోకాలకు..?

మంగళవారం, 9 జూన్ 2020 (18:25 IST)
Athira
భార్యను డెలివరీ కోసం దుబాయ్ నుంచి భారత్‌కు పంపించాడు. అయితే గుండెపోటుతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు.  వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన నితిన్ చంద్రన్(28) దుబాయ్‌లోని ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య అతిరా గీతా శ్రీధరన్(27) ప్రస్తుతం 8 నెలల గర్భవతి. డెలివరీ కోసం గీతాను మే 7న చంద్రన్ కేరళాకు పంపించాడు. ఈ క్రమంలో అతిరా గీతా శ్రీధరన్ పాపకు జన్మనిచ్చింది.
 
ఈ నేపథ్యంలో కరోనా వల్ల వివిధ దేశాలలో చిక్కుకున్న వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం 'వందే భారత్ మిషన్' అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ మిషన్ ద్వారా చంద్రన్.. తన భార్య గీతాను భారత్‌కు పంపించాడు. అతను మాత్రం ఉద్యోగ పనుల వల్ల అక్కడే ఉండిపోయాడు. సోమవారం రాత్రి నిద్రలో ఉండగా చంద్రన్‌కు బీపీ పెరిగి గుండెపోటు వచ్చింది. 
 
దాంతో చంద్రన్ నిద్రలోనే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారని చంద్రన్ స్నేహితుడు తెలిపాడు. దుబాయ్‌లో కేరళలో సామాజిక కార్యక్రమాల్లో నితిన్‌ చురుగ్గా ఉండేవాడని అతని మిత్రులు చెప్పారు. రక్తదాన శిబిరాల ఏర్పాటుతో ఎందరి ప్రాణాలో నిలిపాడని గుర్తు చేసుకున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు