అమెరికా ప్రయాణం ఇకపై ఓ కల... యూఎస్ వీసా గగనమే....

శుక్రవారం, 3 మార్చి 2017 (09:41 IST)
ఇకపై అమెరికా ప్రయాణం ఓ కలగానే మిగిలిపోనుంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన వలస విధానంలో ఆ దేశ వైఖరి పూర్తిగా మారిపోయింది. దేశంలోకి వచ్చిన వారిని బయటకు పంపడం కన్నా... అసలు దేశంలోకే ఎవరుపడితే వారు రావడాన్ని అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. 
 
ఫలితం.. భారతలోని అమెరికా రాయబార కార్యాలయాలు గతంలోలాగా ఎక్కువ వీసాలు జారీ చేయడం లేదు. గతేడాది మొత్తం 1.65 లక్షల వీసాలు జారీ చేసిన ఇక్కడి ఎంబసీలు ఈ ఏడాది 40 వేలకు మించి జారీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఈ యేడాది వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి నిరాశే మిగులుతోంది. ఈ ఏడాది ఇప్పటికి కేవలం 8-9వేల వీసాలే జారీ చేయడంతో ఇకపై అమెరికా వీసాలు అంత సులభం కాదని స్పష్టమవుతోంది. 
 
హెచ్‌1బీ వీసా మంజూరు చేయాల్సిన అమెరికాలోని కంపెనీలు కూడా ఇప్పుడు వెనుకంజ వేస్తున్నట్లు అమెరికాలోని భారత ఎన్నారైలతో పాటు పలు కన్సల్టెన్సీల నిర్వహకులు తెలిపారు. చాలా కంపెనీలు అసలు హెచ్‌1బీ వీసాలు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని వివరించారు. అన్ని అర్హతలున్నా.. కొందరు ఉద్యోగుల వీసా జారీ ప్రక్రియను మూడు నెలలు పెండింగ్‌లో పెట్టినట్లు ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి