అంతర్జాతీయ ఉగ్రవాదిగా సయ్యద్ సలావుద్దీన్ : అమెరికా ప్రకటన

మంగళవారం, 27 జూన్ 2017 (09:19 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈయన పర్యటనకు ముందు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో మకాం వేసి భారత్‌ను అల్లకల్లోలం చేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్‌ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా రక్షణ మంత్రితో మోడీ సమావేశమైన కాసేపటికే అమెరికా ఈ నిర్ణయం ప్రకటించింది. 
 
అమెరికా ప్రకటనతో సలావుద్దీన్‌కు సహకరిస్తున్న వారిపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. సలావుద్దీన్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటూ భారత్‌ను అస్థిరం చేసేందుకు యత్నిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి అన్నివిధాలా సహకారం అందిస్తూ.. అక్కడ అశాంతి నెలకొనడానికి  ప్రధాన కారకుడిగా ఉన్నాడు. దీంతో ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. 

వెబ్దునియా పై చదవండి