మొదట జారిపడ్డ బైడెన్.. తన కుడిచేత్తో రెయిలింగ్ పట్టుకుని లేచి రెండు మెట్లు ఎక్కగానే మళ్లీ జారిపోయారు. తనంతటతానుగా లేస్తుండగా... ఎడమకాలు జారడంతో మరోసారి పడిపోయారు. అనంతరం లేచి ఎడమ కాలును దులుపుకుని మొత్తానికి పైకి చేరుకున్నారు. అందరికి అభివాదం చేస్తూ విమానం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం అధ్యక్షుడు బైడెన్ బాగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు.