ఈ నెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అలా మొదలైన ఈ ఓట్ల లెక్కింపు నాలుగు రోజులుగా కొనసాగుతూ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరకు శనివారం రాత్రికి ఓ క్లారిటీ వచ్చింది. ఫలితంగా యూఎస్ 46వ అధ్యక్షుడిగా జోసఫ్ రాబినెట్టి బైడెన్ జూనియర్ విజయం సాధించారు.
దాదాపు నాలుగు రోజులకు పైగా ఓటింగ్ కొనసాగిన పెన్సిల్వేనియాలో బైడెన్ విజయం సాధించారని, దీంతో మెజారిటీకి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లకు మించి ఆయనకు వచ్చాయని సీఎన్ఎన్, ఎన్బీసీ, అసోసియేటెడ్ ప్రెస్ వంటి వార్తా సంస్థలు వెల్లడించాయి.
ఆరిజోనాను పక్కనబెట్టినా, విజయానికి అవసరమైన 270 ఓట్లతో పోలిస్తే 273 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ ఖాతాలో ఉన్నట్టు. అయితే, ఇప్పటికీ, తన ఓటమిని అంగీకరించేందుకు ట్రంప్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం.