సాధారణంగా చలికాలంలో అమెరికాలోని చాలా నదులు గడ్డ కట్టేస్తుంటాయి. వెస్ట్‌బ్రూక్ నగరంలోని ప్రీసంప్‌స్కాట్ నదిలో కూడా అదే జరిగేది. అయితే, 2019లో మాత్రం.. నదిలో గడ్డకట్టిన నీరు గుండ్రంగా తిరుగుతూ కనిపించింది. అప్పట్లోనే చాలామంది దాన్ని గ్రహాంతరవాసుల పనేనని అనుకున్నారు.
దీనిపై నిపుణులు స్పందిస్తూ.. నది లోపల ఏర్పడే కరెంట్ (ప్రవాహం), సుడిగుండాల వల్ల ఈ డిస్క్ ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. నది సుడులు తిరుగుతున్నప్పుడు నీరు క్రమేనా గడ్డకట్టి ఉంటుందని, అందుకే అది అలా గుండ్రంగా కట్ చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ఆ ఐస్ గడ్డ మీదకు ఎక్కేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.