అనోఫిలిస్ దోమ ఆధారంగా జెస్సికాబృందం వ్యాక్సిన్‌ను రూపొందించారు. దోమ లాలాజలంలోని ప్రొటీన్ శరీరంలోకి ప్రవేశించగానే గుర్తించి, దాని నుంచి ఏ వైరస్ కూడా లోపలికి రాకుండా శరీరం అడ్డుకునే విధంగా ఈ వ్యాక్సిన్ పనిచేయనుంది. ఇది సఫలమైతే.. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఎన్నో రకాల వైర్‌సలకు చెక్ పెట్టవచ్చు.