కొత్త వేరియంట్లనూ ఢీకొనే టీకాలు

బుధవారం, 7 జులై 2021 (09:53 IST)
కొవిడ్‌-19కు మరింత సమర్థమైన టీకాను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఫార్ములాను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది కరోనాలో వేగంగా పుట్టుకొస్తున్న వేరియంట్లనూ ఎదుర్కోగలదని పేర్కొన్నారు.

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు స్పందనగా రోగ నిరోధక వ్యవస్థ క్రియాశీలమయ్యే తీరు ఆధారంగా బోస్టన్‌ విశ్వవిద్యాలయం, హార్వర్డ్‌ వర్సిటీలోని బ్రాడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు. ప్రస్తుత కొవిడ్‌ టీకాలు రోగ నిరోధక వ్యవస్థలోని ‘బి’ కణాలను క్రియాశీలం చేయడంపై ప్రధానంగా దృష్టిపెడుతున్నాయి. 
 
సహజసిద్ధంగానే కరోనా ఆవిర్భావం!
చైనాలోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీక్‌ అయిందన్న ఆరోపణలను నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలేవీ లేవని అంతర్జాతీయ నిపుణుల బృందమొకటి పేర్కొంది. ఈ వైరస్‌ ప్రకృతిసిద్ధంగానే ఆవిర్భవించిందని అనేక అధ్యయనాలు గట్టిగా సూచిస్తున్నాయని తెలిపింది.

ఈ మేరకు వారు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ఒక కథనం రాశారు. ఈ బృందంలో దాదాపు పాతిక మంది జీవశాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, అంటువ్యాధుల నిపుణులు, వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు, జంతువైద్య పరిశోధకులు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు