ఓ వైపు భారీ వర్షం.. మరోవైపు పెద్ద పెద్ద వడగళ్లు నెత్తిపై పడుతున్నప్పటికీ ఆ రిపోర్టర్ రిపోర్టింగ్ చేయడం ఏమాత్రం ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గతవారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానిక న్యూస్ ఛానల్‌కు చెందిన ఓ మహిళా రిపోర్టర్ లైవ్ కవరేజీ కోసం వెళ్లింది.
రెయిన్ కోట్ వేసుకుని రిపోర్టింగ్ చేస్తోంది. అప్పటికే భారీ వర్షం కురుస్తుంది. వడగళ్లు కూడా పడుతున్నాయి. అవి నేరుగా నెత్తిపై పడినా, ఆమె మాత్రం రిపోర్టింగ్ మానలేదు. అంతేగాకుండా వాతావరణ పరిస్థితి చక్కగా వివరించింది. వడగళ్ల నుంచి తప్పించుకునేందుకు చేతి అడ్డుపెట్టుకున్న ఆమెను చూసిన స్టూడియోలోని న్యూస్ యాంకర్ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని చెప్తున్నా.. పట్టించుకోలేదు.