కార్గిల్‌లో కొండ నుంచి సెలయేరులో పడిన ఎలుగుబంటి.. కారణం ఎవరంటే? (వీడియో)

మంగళవారం, 14 మే 2019 (12:54 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలో ఎలుగుబంటిపై దాడి జరిగిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ముహమ్మద్ షా అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రౌన్ రంగులో వుండే ఎలుగుబంటి రాళ్ల కొండపై ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కొండమీద వున్న మనుషులు దాడికి పాల్పడటంతో కొండపై నుంచి జారి పడి సెలయేరులో పడిపోయింది. 
 
కొండపై ఎక్కుతూ కనిపించిన ఎలుగుబంటిపై కొండపై నిల్చున్న మనుషులు దాడి చేయడం దారుణమని ఆ ఎలుగుబంటి నీళ్లలో పడిపోవడం చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎలుగుబంటిపై దాడికి పాల్పడాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నెటిజన్లు పైర్ అవుతున్నారు. 
 
ఎలుగుబంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

This is macabre, happened today at Drass. pic.twitter.com/rtnqzghLF3

— Mahmood Ah Shah (@mashah06) May 9, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు