భారత్‌తో పాక్ సంబంధాలు బలపడాలని, అయితే, అందుకు టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై తమ జట్టు గెలిచిన ఈ తరుణం సరైంది కాదని అన్నారు. ఇలాంటి టైంలో అసలు ఆ ఊసు కూడా ఎత్తకూడదన్నారు. భారత్, పాక్ మధ్య ఉన్న ఏకైక సమస్య కాశ్మీర్ మాత్రమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ సమస్యను హుందాగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో నిర్వహించిన పాకిస్థాన్-సౌదీ ఇన్వెస్ట్ మెంట్ ఫోరంలో ఆయన మాట్లాడారు. చైనాతో తమకు మంచి సంబంధాలున్నాయని, భారత్ తో కూడా సంబంధాలు బలపడితే భారత్, పాక్ రెండూ శక్తిమంతమైన దేశాలుగా ఎదుగుతాయని చెప్పారు.