ఒక్క పండు ధర రూ.70 వేల రూపాయలా??

శుక్రవారం, 8 మార్చి 2019 (16:12 IST)
సాధారణంగా మనం కుళ్లిపోయిన వాసన వస్తేనే, అలాంటి వస్తువులను ముట్టుకోము. అలాంటిది మురికి కాలువ, చెమట పట్టిన సాక్స్ వాసన వచ్చే పండుని తినడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చదివారా? భూమిపై ఇలాంటి పండు కూడా ఉంటుందని మీకు తెలుసా. ఈ పండు ఖరీదు ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ పండు ఖరీదు అక్షరాల డెబ్బై వేలు. అవును మీరు వింటున్నది నిజమేనండి బాబూ. ఈ పండు ధర రూ.71,141 (1000 డాలర్లు). 
 
ఈ పండులో అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా? ఇది చాలా అరుదుగా లభించే పండు. ఆగ్నేసియాలో లభించే ఈ పండు పేరు డురియన్. జే-క్వీన్ హైబ్రిడ్ రకానికి చెందిన ఈ పండును ఇండోనేషియా ప్రజలు పండ్లలో రారాజుగా భావిస్తారు. ఈ పండు గుండ్రటి ఆకారంలో ఉంటూ.. చాలా అరుదుగా లభించడం వల్ల వీటి ధర అంత ఉంటుంది.
 
ఈ పండ్లు నుంచి వచ్చే దుర్వాసన కారణంగా సింగపూర్‌లోని కొన్ని హోటళ్లు వీటిని నిషేధించారు. ఈ పండు 1000 డాలర్లకు అమ్ముడవుతుండడం వల్ల ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు