శాకాహారంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా జరిగిన పరిశోధనలో మాంసాహారం తీసుకునేవారి కంటే శాకాహారం తీసుకునే వారిలో అనారోగ్య సమస్యలు తక్కువని తేలింది. ఎందుకంటే శరీరానికి కావలసిన పోషకాలు ప్రోటీన్లు శాకాహారంలో పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలే ఆరోగ్యానికి శక్తినిస్తాయని అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వవని న్యూట్రీషియన్లు అంటున్నారు.
ఇంకా శాకాహారం తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చాలామటుకు తక్కువని పరిశోధనలో తేలింది. మాంసాహారం తీసుకునే వారిలో హృద్రోగాలైన గుండెపోటు వంటి ఇబ్బందులు తప్పట్లేదని పరిశోధన తేల్చింది. మాంసాహారం తీసుకోవడం ద్వారా అధిక ప్రోటీన్లు, కెలోరీలు, కొలెస్ట్రాల్, ధాతువులు లభించినా.. ఆరోగ్యానికి చేడు కలిగించేవి వున్నాయని పరిశోధకులు తేల్చారు.
మాంసాహారం తీసుకునేవారి రక్తంలో అధిక శాతం కొలెస్ట్రాల్ వుండటంతో అవి హృద్రోగ సమస్యలకు దారితీస్తాయని, ఇందులోని ధాతువులతో అజీర్తి ఏర్పడుతుంది. ఇది కాలక్రమేణా అల్సర్‌కు దారితీస్తుందని తేలింది. అంతేగాకుండా మాంసాహారం తీసుకోవడం ద్వారా చర్మ సమస్యలు, అలెర్జీ, ఆస్తమా వంటి రుగ్మతలు కూడా తప్పవని పరిశోధకులు చెప్తున్నారు.
ముఖ్యంగా శాకాహారం తీసుకునే వారిలో మధుమేహం వుండదని, మాంసాహారమే మధుమేహానికి దారితీస్తుంది. అలాగే అధిక రక్తపోటుకు కూడా కారణమవుతుందని పరిశోధనలో తేలింది. కానీ శాకాహారం తీసుకునేవారిలో..మానసిక ఆందోళన వుండదని.. ఉత్సాహం చేకూరుతుందని పరిశోధన తేల్చింది. సో శారీరక, మానసిక ఆరోగ్యానికి శాకాహారమే ఉత్తమం అన్నమాట.