ఆకట్టుకుంటున్న యోషినో చెర్రీ పూలు

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:07 IST)
వాషింగ్టన్‌లో లేత గులాబీ పూలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వచ్చే వసంత ఋతువులో లేత గులాబీ రంగులో చెర్రీ పూలు వికసిస్తాయి. వీటిని యోషినో చెర్రీ పూలు అని పిలుస్తారు. 
 
పోటోమాక్ నది ఒడ్డున, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ మైదానంలో, టైడల్ బేసిన్ చుట్టూ సుమారు నాలుగువేల చెర్రీ వృక్షాలు పూలతో జల్లెడ వలె కనిపిస్తాయి. 
 
1912వ సంవత్సరంలో జపాన్ ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా యునైటెడ్‌ స్టేట్స్‌‌కు మూడు వేల చెర్రీ చెట్లను బహుమతిగా ఇచ్చింది. ప్రతి ఏడాది చెర్రీ పూల పండుగకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో హాజరవుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు