ఈ వివరాలను పరిశీలిస్తే.. బ్రిస్బేన్ సిటీలోని పంజాబీ కమ్యూనిటీలో మన్మీత అలిషెర్‌కు మంచి గాయకుడిగా పేరుంది. ఎప్పటిలాగే శుక్రవారం మన్మీత విధుల్లో నిమగ్నమయ్యారు. 9 గంటల ప్రాంతంలో బ్రిస్బేన్ కౌన్సిల్ బస్‌ను నడుపుతున్నాడు. బ్యూడిసెర్ట్ రోడ్‌లో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు బస్ ఆపగానే మధ్యవయస్కుడు ఒకరు మన్మీతపైకి ద్రవ ఇంధనాన్ని విసిరాడు. మండే గుణం ఉన్న ఆ ఇంధనంలో తడిసిన మన్మీతకు నిప్పంటుకుంది.
దీంతో బస్ మొత్తం పొగతో నిండిపోయింది. ఆపై క్షణాలలోనే మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ఆ సమయంలో బస్ ఆగిన ప్రదేశానికి దగ్గర్లో ఉన్న ఓ టాక్సిడ్రైవర్ చురుగ్గా స్పందించి బస్ వెనక డోర్ ద్వారా ప్రయాణికులను బయటికి తీసుకొచ్చాడు. ఈ ఘటనలో డ్రైవర్ మన్మీత అక్కడికక్కడే మరణించారు. మన్మీతపై దాడిచేసిన వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.