అమెరికాలో 67 ఏళ్ల తర్వాత మహిళకు మరణశిక్ష.. ఇంజెక్షన్ ఇచ్చారు.. గర్భవతిని?

బుధవారం, 13 జనవరి 2021 (13:28 IST)
Lisa Montgomery
అమెరికాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 67 ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళకు మరణ శిక్షను ప్రభుత్వం అమలు చేసింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి .. కొన్ని రోజుల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు తీర్పు మేరకు.. లీసా మోంట్‌గోమెరి అనే 52 ఏళ్ల మహిళను అమెరికా ప్రభుత్వం చంపేసింది. 
 
జనవరి 12 అర్ధరాత్రి 1 గంట సమయంలో లీసాకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చారు. మోంట్​గోమెరికి ఈనెల 8నే శిక్ష పడాల్సింది. అయితే ఇద్దరు అటార్నీలకు కరోనా సోకడంతో ఆమె శిక్షను 2021 జనవరి 12కి అటార్నీ జనరల్​ విలియమ్ బార్​ వాయిదా వేశారు. మరణ శిక్షను ఆపాలని వైట్ హోస్​ను డిమాండ్ చేస్తూ కొందరు న్యాయవాదులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే శిక్షను అమలు చేసింది అమెరికా ప్రభుత్వం. 
 
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన హయాంలోనే అమెరికాలో మళ్లీ మరణశిక్షలను అమలు చేయడం మొదలుపెట్టారు. దాదాపు 17 ఏళ్ల నుంచి ఒక్కర్ని కూడా అమెరికా జైళ్లలో ఇంజక్షన్ ఇచ్చి చంపలేదు. కానీ గత ఏడాది జులై నుంచి మళ్లీ మరణ శిక్షలను అమలు చేస్తున్నారు. లిసా మోంట్​గోమెరీ అనే మహిళ 2004లో దారుణానికి ఒడిగట్టింది. 
 
ముస్సోరిలో బోబి స్టినెట్ అనే గర్భవతిని పాశవికంగా హత్య చేసింది. కడుపులోని పేగును కొసి ఎనిమిది నెలల పసి కందును బయటికి తీసింది. ఆ బిడ్డ బతికినా.. బోబీ చనిపోయింది. ఆ తర్వాత జీవించి ఉన్న ఆ బిడ్డను తండ్రికి పోలీసులు అప్పగించారు. తర్వాత లిసా మోంట్​గోమరీని అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఆమెకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు