అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకెళతాం

బుష్ హయాంలో భారత్- అమెరికాల మధ్య కుదిరిన చారిత్రాత్మక పౌర అణు ఒప్పందాన్ని బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం విస్మరిస్తోందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. యూఎస్ విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తమ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళుతుందని హామీ ఇచ్చారు.

ఒబామా అధికారిక యంత్రాంగం అణు ఒప్పందాన్ని పక్కనబెట్టిందని భారత్‌లో ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అణు ఒప్పందంపై హిల్లరీ క్లింటన్ బుధవారం మాట్లాడుతూ.. ఇరుదేశాల సంబంధాల్లో దీనికి కీలకపాత్ర ఉందన్నారు. గత దశాబ్దకాలంగా ఇరుదేశాల సంబంధాలను అత్యంత ప్రభావితం చేసిన అంశం ఇదని చెప్పారు.

భారత్- అమెరికా పౌర అణు సహకార ఒప్పందాన్ని ఇరుదేశాలకు చారిత్రాత్మక ఒప్పందంగా హిల్లరీ క్లింటన్ అభివర్ణించారు. దీనిని అమలు చేసేందుకు బరాక్ ఒబామా యంత్రాంగం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ఒప్పందానికి ఇరుదేశాల్లోని ప్రధాన రాజకీయపక్షాలు మద్దతుగా నిలిచాయని ఆమె గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి