ఉత్తర వజీరిస్థాన్‌లో సైనిక చర్య ఉండదు: పాక్

ఉత్తర వజీరిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై సైనిక చర్య చేపట్టబోమని పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది. స్థానిక గిరిజనులతో ప్రభుత్వం కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని తాము గౌరవిస్తామని తెలిపింది. ఈ ప్రాంతంలో భద్రతా దళాలపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోయాయి. అయినప్పటికీ ఉత్తర వజీరిస్థాన్‌లో సైనిక ఆపరేషన్ చేపట్టబోమని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది.

ఉత్తర వజీరిస్థాన్‌లోనూ పాక్ సైన్యం దాడులు చేస్తుందని గత కొంతకాలంగా స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే పాకిస్థాన్ మిలిటరీ హెలికాఫ్టర్ల ద్వారా పష్తో, ఉర్దూ భాషల్లో సైనిక చర్య చేపట్టబోమని కరపత్రాలు జారవిడవడం ద్వారా స్థానిక గిరిజనులకు శాంతి ఒప్పందాన్ని గౌరవిస్తున్నామనే సందేశం పంపింది. ఉత్తర వజీరిస్థాన్‌లో దాడులు చేసే ఉద్దేశం పాక్ ఆర్మీకి లేదనేది ఈ కరపత్రాల సారాంశం.

వెబ్దునియా పై చదవండి