నేపాల్: ప్రధాని పదవి కోసం కీచులాడుకుంటున్న పార్టీలు

అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్ విధించిన గడువు ఆగస్ట్ 21 కంటే ముందే జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి నేపాల్‌లోని రెండు అతిపెద్ద పార్టీలు గురువారం సమావేశమైనప్పటికీ సంకీర్ణానికి ఎవరు నేతృత్వం వహించాలనే విషయమై అంగీకారానికి రాలేకపోయాయి.

మావోయిస్ట్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధి బాబూరామ్ భట్టారాయ్ మూడో పెద్ద పార్టీ సీపీఎన్-యూఎంఎల్‌ నాయకులతో భేటీ కాగా నేపాల్ కాంగ్రెస్ అభ్యర్ధి షేర్ బహదూర్ దేవ్‌బా మద్దతు కోసం తెరాయ్ ప్రాంత పార్టీలతో చర్చించారు. యూసీపీఎన్-మావోయిస్ట్, ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్‌లు జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాయి. అయితే ప్రభుత్వానికి నాయకత్వం వహించే విషయంలో విభేదాలు ఏర్పడినట్లు హిమాలయన్ టైమ్స్ ఆన్‌లైన్ తన కథనంలో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి