పాకిస్థాన్ 1973 రాజ్యాంగ అసలు ముసాయిదా గల్లంతు

పాకిస్థాన్‌ 1973లో ఆమోదించిన రాజ్యాంగ ఒరిజినల్ ముసాయిదా గల్లంతయింది. 1973 రాజ్యాంగ ముసాయిదా జాతీయ అసెంబ్లీ రికార్డుల్లో అందుబాటులోలేదని పార్లమెంట్ వర్గాలు తెలిపినట్లు ఓ వార్తాపత్రిక కథనాన్ని ప్రచురించింది. అత్యంత కీలకమైన ఈ డాక్యుమెంట్ ఎప్పుడు ఎలా దొంగలించబడిందో తెలుసుకోవడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

దివంగత జుల్ఫీకర్ అలీ భుట్టో తొలి విడత ప్రభుత్వకాలంలో పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ 1973 ఏప్రిల్ 10న దేశ తొలి రాజ్యాంగాన్ని ఆమోదించగా 1973 ఏప్రిల్ 12న ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో నూతన రాజ్యాంగ ముసాయిదాపై జాతీయ అసెంబ్లీ సభ్యులు సంతకాలు చేశారు. అనంతరం నూతన రాజ్యాంగంపై అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టో సంతకం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ హౌస్ రికార్డుల్లో 1973 రాజ్యాంగ ఒరిజినల్ డాక్యుమెంట్‌ను ఎప్పుడూ చూడలేదని పార్లమెంట్ వర్గాలు చెప్పాయి.

18వ సవరణకు ఆమోదం తెలిపే సమయంలో రాజ్యాంగ ఒరిజినల్ డాక్యుమెంట్‌ను చూడాలని జాతీయ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ ఫెమీదా మీర్జా కోరగా రాజ్యాంగం అసలు ముసాయిదా గల్లంతయినట్లు వెలుగులోకి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి