పాక్ నిధుల బిల్లుకు సెనెట్ కమిటీ గ్రీన్‌సిగ్నల్

పాకిస్థాన్‌కు వచ్చే ఐదేళ్లపాటు ఏడాదికి 1.5 బిలియన్ డాలర్ల మిలిటరీయేతర సాయాన్ని అందించే బిల్లుకు అమెరికా సెనెట్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం ప్రతిపాదించిన పాకిస్థాన్ నిధుల బిల్లును కమిటీలో ఎవరూ వ్యతిరేకించలేదు. ఈ బిల్లుకు అమెరికా సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీ 16-0 ఓట్ల తేడాతో ఆమోదముద్ర వేసింది.

తాజాగా ఆమోదముద్ర పడిన బిల్లుకు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు చాలా తేడాలు ఉన్నాయి. ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లు పాకిస్థాన్‌కు కొన్ని కఠిన నిబంధనలను సూచిస్తోంది. తీవ్రవాదంపై పోరు, నిరాయుధీకరణలతో పాకిస్థాన్‌కు అందిస్తున్న నిధులను ముడిపెట్టాలనే ప్రతినిధుల సభ బిల్లుకు ఒబామా యంత్రాంగం మద్దతు పలకలేదు. పాకిస్థాన్‌పై ఇటువంటి కఠిన ఆంక్షలు పెట్టడం తీవ్రవాదంపై పోరును ప్రభావితం చేస్తుందని అమెరికా అధికారిక యంత్రాంగం భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి