పాక్‌కు మరింత ఆర్థిక సహాయం : అమెరికా

పాకిస్థాన్ దేశానికి మరింత ఆర్థిక సహాయం అందివ్వనున్నట్లు అమెరికా తెలిపింది.

పాకిస్థాన్‌లోని పరిశ్రమలను ఆదుకునే నేపథ్యంలో భాగంగా, అలాగే ఆ దేశంలో వేళ్ళూనుకుని ఉన్న ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.20వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు, దీనికి అమెరికా సెనేట్ కూడా ఆమోదం తెలిపినట్లు అమెరికాలోని వైట్‌హోస్ అధికార వర్గాలు వెల్లడించాయి.

పాక్‌‌కు మరింత ఆర్థికసాయం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. తాము అయిదేళ్లవరకుగాను ప్రతి ఏడాదికి 1.5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం అందజేస్తామని అధికారులు తెలిపారు. తాము అందించే ఆర్థిక సహాయంతో సైనికేతకార్యక్రమాలకు, ఆరోగ్యం, చదువు తదితరాలకు ఉపయోగించుకునేలా తాము సూచించనున్నట్లు అమెరికా తెలిపింది.

వెబ్దునియా పై చదవండి