భారత కిడ్నాపర్లు ఫిలిప్పైన్స్‌లో అరెస్ట్

ఫిలిప్పైన్స్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను అపహరించేందుకు ఓ ముఠాగా ఏర్పడ్డ భారతదేశానికి చెందిన ముగ్గురు కిడ్నాపర్లను అక్కడి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

ఫిలిప్పైన్స్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తలను అపహరించే నేపథ్యంలో భాగంగా భారతదేశానికి చెందిన ముగ్గురు కిడ్నాపర్లను బీజింగ్‌లో అదుపులోకి తీసుకున్నామని వీరిలో మంజీత్ సింగ్, సంజీవ్ కుమార్, గుర్మాన్ సింగ్‌లుగా తాము గుర్తించినట్లు యాంటీ క్రైమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ విభాగాధిపతి ఇసాగని తెలిపారు.

వీరి వయస్సు దాదాపు 30నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, వీరికి ఇలాంటి పలు కేసులతో సంబంధముందని ఆయన వివరించారు. ప్రధానంగా ధనికులు, వ్యాపార వర్గాలకు చెందినవారే వీరి టార్గెట్ అని, ఈ విషయం తమ విచారణలో తేలినట్లు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి