భారతీయుల వీసా ఉల్లంఘనలే ఎక్కువ

ఆస్ట్రేలియాలో వీసా ఉల్లంఘనల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని ఆ దేశ ఇమ్మిగ్రేషన్, పౌరసత్వ శాఖ పేర్కొంది. విద్యార్థి వీసా కార్యక్రమంపై ఈ శాఖ జరిపిన సమీక్షలో ఆస్ట్రేలియాలో వీసా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో బంగ్లాదేశీయులు, కాంబోడియన్లు, భారతీయులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

మిగిలిన దేశాలతో పోలిస్తే ఈ దేశాల విద్యార్థులు ఎక్కువగా వీసా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆస్ట్రేలియా ప్రబుత్వం తెలిపింది. వీసా ఉల్లంఘనలకు పాల్పడుతున్న దేశాల విద్యార్థులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేసే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా జరిపిన వార్షిక సమీక్షలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వీసా ఉల్లంఘనలకు పాల్పడిన దేశాలేవీ లేనప్పటికీ, ప్రమాదకర స్థాయిలో వీసా ఉల్లంఘనలకు పాల్పడిన దేశాల్లో (లెవెల్ 4) భారత్, బంగ్లాదేశ్, కాంబోడియా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి