భారత్‌కన్నా తాలిబన్లతోనే ప్రమాదం: జర్దారీ

గురువారం, 25 జూన్ 2009 (20:35 IST)
భారతదేశంకన్నా తాలిబన్లతోనే తమకు ఎక్కవు ప్రమాదమని పాక్ తెలిపింది.

తమ దేశానికి పొరుగుదేశమైన భారత దేశంకన్నాకూడా తాలిబన్లతోనే ఎక్కవుగా ప్రమాదం పొంచి ఉందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అన్నారు.

భారతసైన్యం తమ దేశాన్ని బెదిరిస్తోందని తాము అనుకోవడం లేదని, తమ భయం అంతాకూడా తాలిబన్లతోనేనని ఐరోపా ఖండంలోని బ్రుస్సెల్‌లో జరిగిన అధికారిక సమావేశంలో పాల్గొన్న జర్దారీ అన్నారు.

భారత్-పాక్‌ల మధ్య ప్రత్యక్షమైన పోరుంటుందని, కాని తాలిబన్లు తమ దేశాన్ని బెదిరిస్తున్నారని ఆయన ఈ సమావేశంలో అన్నారు. తన ప్రసంగం ప్రధానంగా తాలిబన్లపైనే జరిగిందని ది డైలీ టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.

గతంలో ఉన్న అధ్యక్షుని చేతగానితనానికి ప్రస్తుతం తాము బాధపడుతున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తాము తాలిబన్లను ఏరివేసేందుకు తీసుకున్న చర్యలలో భాగంగా సత్ఫలితాలను సాధిస్తున్నామని, అయినాకూడా తమకు వారినుండే ప్రమాదం పొంచివుందని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి