మా దృష్టి అణ్వాయుధాలపై లేదు: ఇరాన్

వివాదాస్పద అణు కార్యక్రమం అమెరికా మరోసారి తీవ్ర స్వరంతో హెచ్చరించడంతో ఇరాన్ ప్రభుత్వం కూడా తమ వాదనను బలంగా వినిపించింది. తమకు అణ్వాయుధాలు తయారు చేయాలనే ఆలోచన అసలు లేదని పునరుద్ఘాటించింది. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసేందుకు చేపట్టే ఎటువంటి చర్యనైనా అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ అధికారిక యంత్రాంగం మాట్లాడుతూ.. తాము అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేశామని గుర్తు చేసింది. శాంతియుత అణ కార్యకలాపాలు సాగించే హక్కు తమకు ఉందని ఉద్ఘాటించింది. తమ రక్షణ నిర్మాణంలో అణ్వాయుధాలకు స్థానం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి హసన్ ఘాష్‌ఘావీ విలేకరులతో చెప్పారు.

వెబ్దునియా పై చదవండి