మైనారిటీలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా సోమాలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తరువాతి స్థానాల్లో ఇరాక్, సూడాన్, ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్ దేశాలు ఉన్నాయి. ప్రముఖ మనవ హక్కుల పరిరక్షణ సంస్థ వెల్లడించిన నివేదికలో ప్రపంచంలో మైనారిటీ గ్రూపులకు అత్యంత ప్రమాదకర దేశాల్లో సోమాలియా, ఇరాక్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
గత ఏడాది జాబితాలోనూ సోమాలియా, ఇరాక్, సూడాన్, ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్ దేశాలే తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాల్లో జాతి సంహారాలు, సామూహిక హత్యలు, ఇతర మైనారిటీ హింసాత్మక చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.
మైనారిటీ రైట్స్ గ్రూపు ఇంటర్నేషనల్ (ఎంఆర్‌జీ) తయారు చేసిన తాజా జాబితాలో పాకిస్థాన్, ఇథియోపియా, ఎరిట్రియా, జార్జియా, జింబాబ్వే, గ్యునియా, నైగెర్, కెన్యనా, ఇజ్రాయేల్, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోనూ మైనారిటీలపై హింసాత్మక చర్యలు గత ఏడాది కంటే ఈసారి పెరిగాయని నివేదిక వెల్లడించింది.