లిబియోలో సయోధ్యకు పిలుపునిచ్చిన ఐరాస ఛీఫ్

లిబియా తిరుగుబాటుదారులు సయోధ్యకు సహకరించి జాతి సమగ్రతకు పాటుపడాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధానకార్యదర్శి బాన్ కీమూన్ పిలుపునిచ్చారు. రెబెల్ నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌ అధిపతి ముస్తాఫా అబ్దెల్ జలీల్‌కు బాన్ మంగళవారం ఫోన్ ద్వారా తన సందేశాన్ని తెలిపారని ఐక్యరాజ్యసమితి ఉపప్రతినిధి ఫర్హాన్ హక్ చెప్పారు.

జాతి సమగ్రత, సయోధ్య వంటి అంశాలను సీరియస్‌గా తీసుకొంటామని అబ్దెల్ జలీల్ ఐరాస ప్రధాన కార్యదర్శికి హామీ ఇచ్చినట్లు హక్ తెలిపారు. సంక్షోభం ముగిసిన అనంతరం లిబియా అభివృద్ధికి ఐరాస మద్దతును అబ్దెల్ జలీల్ కోరినట్లు ఆయన చెప్పారు. లిబియా సంక్షోభ అనంతర పరిస్థితులను చర్చించడానికి గానూ పలు కీలక ప్రాంతీయ సంస్థలతో శుక్రవారం బాన్ సమావేశం కానున్నారు.

వెబ్దునియా పై చదవండి