అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కేవలం ఒక్క దఫా మాత్రమే అమెరికాను పాలించినట్లయితే సగటు అధ్యక్షుడిగా మాత్రమే చూడబడతారని ప్రెసిడెన్షియల్ ర్యాంకింగ్ సర్వేస్ గణాంక విశ్లేషణ వెల్లడించింది. ఈ పరిస్థితుల మధ్య ఒబామా ర్యాంకింగ్ లిస్ట్‌లో మాజీ అధ్యక్షులు విలియమ్ మెకిన్లే, జార్జ్ హెచ్‌డబ్లూ బుష్‌ల మధ్యలో 22వ స్థానంలో నిలిశారు.
2012 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా ఓడినట్లయితే ఒక్క దఫాలో మంచి పాలన అందించిన అధ్యక్షుడిగా మాత్రమే నిలుస్తాడని బేలర్ యూనివర్శిటీ రాజనీతి సహాయక ప్రొఫెసర్ కర్ట్ నికల్స్ చేసిన పరిశోధన పేర్కొంది. సెప్టెంబర్ 4న జరిగే అమెరికా రాజనీతిశాస్త్ర అసోసియేషన్ వార్షిక సమావేశంలో నికల్స్ తన పరిశోధక పత్రాన్ని ప్రెజెంట్ చేస్తారు.