సిసిలాన్‌లో భూకంపం : 13 మంది మృతి

ఇటలీలోని సిసిలాన్‌ నగరంలో భారీ వర్షాలతోపాటు భూమి కంపించింది. దీంతో దాదాపు 13 మంది మృతి చెందగా చాలామంది తీవ్రగాయాలపాలైనారు.

సిసిలాన్ నగరంలో వర్షాలు కురవడంతోపాటు భూమి తీవ్రంగా కంపించిందని, దీంతో 13 మంది మృతి చెందగా దాదాపు 40మంది తీవ్రగాయాలపాలై ఆసుపత్రి పాలైనారని ఇటలీకి చెందిన పౌరసురక్షాధికారి గుయిడో బరతోలాసో శుక్రవారం అర్ధరాత్రి మీడియాకు సమాచారం అందించారు.

ఇదిలావుండగా భూమి తీవ్రంగా కంపించడంతో చాలామంది కనిపించడం లేదని, వారికోసం వెతుకులాట ప్రారంభించామని ఆయన అన్నారు. కాగా పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి