మస్కట్లో ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం, లవ్ సీన్స్ ఫ్రెష్‌గా వుంటాయి: లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (18:42 IST)
సుప్రీం హీరో సాయిధరంతేజ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి కె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇంటిలిజెంట్. అందాల తార లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. నటసింహ బాలకృష్ణ రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలోని పాటల్ని రిలీజ్ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అందరి అంచనాలకు రీచ్ అయ్యే విధంగా ఇంటిలిజెంట్ సినిమా రూపొందిందని టాక్ వినిపిస్తుంది.


ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఫిబ్రవరి నాలుగున రాజమండ్రిలో అశేష సినీ ప్రేక్షకాభిమానులు మధ్య అట్టహాసంగా జరిగిన సంగతి తెల్సిందే. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యుఏ సర్టిఫికెట్‌ని సాధించింది. ఫిబ్రవరి తొమ్మిదిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా హైయ్యస్ట్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి ఆరున సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఇంటిలిజెంట్ చిత్ర విశేషాల గురించి జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
ఈ చిత్రం లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
ఈ మూవీలో నేను సంధ్య క్యారెక్టర్లో నటించాను. యుఎస్‌లో చదువుకొని ఇండియాకి వచ్చి మా డాడీ బిజినెస్‌లు చూస్తుంటాను. చాలా కోపం ఎక్కువ. ఎప్పుడూ అందరికన్నా డామినేట్‌గా ఉంటుంది. అలాంటి అమ్మాయి ప్రేమలో ఎలా పడింది అనేది సస్పెన్స్. క్యూట్ లవ్ స్టోరీ. యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది.
 
సాయిధరంతేజ్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
తేజ్ చాలామంచి యాక్టర్‌తో పాటు మంచి డాన్సర్ కూడా. సెట్లో ఎప్పుడూ జోక్స్ వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి. మస్కట్లో షూటింగ్ జరిగినప్పుడు ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. లవ్ సీన్స్ అన్నీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి.
 
సినిమా మెయిన్ స్టోరీ ఏంటి?
కథ చాలా ఇంటిలిజెంట్‌గా ఉంటుంది. వెరీ టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. ఒక సామాన్య వ్యక్తి తన తెలివితేటలతో సమాజానికి, పేద ప్రజలకి ఎలాంటి మేలు చేసాడనేది మెయిన్ కాన్సెప్ట్. ఇవే కాకుండా ఇంకా మూవీలో చాలా అంశాలు ఉంటాయి. ధర్మ క్యారెక్టర్లో తేజ్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు.
 
డ్యాన్స్ విషయంలో ఏమైనా ప్రాక్టీస్ చేశారా?
ఫస్ట్ టైం ఈ చిత్రంలో డ్యాన్సులు బాగా ప్రాక్టీస్ చేసి వేశాను. నా ఫెవరెట్ లెజండరీ యాక్టర్ చిరంజీవి గారి "చమక్ చమక్" సాంగ్‌ని తెలుగు, హిందీలో చూసాను. ఆ పాటని రీమిక్స్ చేయడం చాలా కష్టం. అయినా ఈ మూవీలో చేసాం. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. సెల్ ఫోన్, కళకళ కళామందిర్, పాటలు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. తేజ్‌తో డాన్స్ చేయడం బాగా ఎంజాయ్ చేసాను.
 
వినాయక్‌తో మీ వర్కింగ్ ఎక్స్పీపీరియన్స్?
వెరీ హంబుల్ అండ్ వెరీ స్వీట్  డైరెక్టర్. పెద్ద డైరెక్టర్ అయినా కూడా డౌన్ టు ఎర్త్‌గా వుంటారు. చాలా కంఫర్టుబుల్‌గా సెట్లో వుంటారు. ఆయనకేం కావాలో క్లియర్‌గా తెల్సు. ఏ సీన్ అయినా చాలా ఫాస్ట్‌గా తీస్తారు. నటిగా ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను.
 
సినిమా హిట్ ప్లాప్‌లను మీరు ఎలా స్వీకరిస్తారు?
హిట్ ప్లాప్ అనేది కామన్. సక్సెస్‌ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో చూసుకొంటాం. ఫీడ్ బ్యాక్ అనేది కచ్చితంగా తీసుకుంటాను. భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు కమర్షియల్‌గా నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అలాగే ఇంటిలిజెంట్ కూడా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
 
నెక్స్ట్ ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు?
డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలననుకుంటాను. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమాలో నా క్యారెక్టర్‌ని ఎంతో ఇష్టపడి చేశాను.
 
సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్లో చేయడం ఎలా అనిపించింది?
సి కళ్యాణ్ వెరీ ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. ప్రతిరోజూ సెట్‌కి వచ్చి అందరికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్‌గా నిర్మించారు. పాటలకి మాత్రమే కాకుండా ఫైట్స్‌కి కూడా భారీగా సెట్స్ వేసి తీశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సి వి రావు, పత్సా నాగరాజ్ ఇద్దరూ చాలా సహకారం అందించారు. సినిమాని వండర్‌ఫుల్‌గా చేశారు. సికెలో మళ్లీమళ్లీ వర్క్ చేయాలని వుంది.
 
ఎస్ఎస్ థమన్ మ్యూజిక్‌కి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుంది?
చాలా హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది. దాదాపు యాభై వేలమందికి పైగా హాజరయ్యారు. చాలా సంతోషంగా అన్పించింది? సాంగ్స్ అన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. థమన్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది.
 
మీ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పే ఆలోచన ఏమైనా ఉందా?
డెఫినెట్‌గా చెప్పాలని వుంది. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. ఇంకా ఇంప్రూవ్ అయ్యాక డబ్బింగ్ చెప్తాను.
 
నెక్స్ట్ కమిట్ అయిన మూవీస్ ఏంటి?
గీతా ఆర్ట్స్ విజయ్ దేవరకొండ మూవీ చేస్తున్నాను. పరశురామ్ డైరెక్టర్. తమిళ్, మలయాళం నుండి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇంకా ఏదీ కమిట్ కాలేదు. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుకే ఇస్తాను. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది లావణ్య.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు