సినిమా పేరు : జవాన్
విడుదల తేదీ : డిసెంబర్ 1, 2017
నటీనటులు: సాయిధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న, జయప్రకాశ్ తదితరులు
విన్నర్, తిక్క వంటి సినిమాలు ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో.. జవాన్ సినిమా ద్వారా హిట్ కొట్టాలని సాయిధరమ్ తేజ్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించారు. సమాజం, దేశంపై గౌరవం వున్న ఓ యువకుడు జై (సాయిధరమ్‌తేజ్) డీఆర్డీవోలో ఉద్యోగం చేయాలనుకుంటాడు.
దేశం కోసం ప్రాణాలిచ్చే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. దేశం కోసం ప్రాణాలిచ్చే దేశభక్తుడు ఓవైపు.. దేశం ఏమైపోయినా పర్లేదు నేను బాగుంటే చాలు అనుకునే స్వార్థపరుడి మధ్య జరిగే కథే జవాన్. తెలిసిన కథైనా.. ప్రేక్షకులను థ్రిల్ చేశాడు దర్శకుడు. ట్విస్ట్ లేకుండా కథ చెప్పుకుంటూ పోయాడు దర్శకుడు. హీరో, విలన్ మధ్య మైండ్ గేమ్ ఎలా జరుగుతుందనేదే కథ. విలన్ ఆపరేట్ చేసే విధానం ఆసక్తికరంగా లేదు.
ఇక హీరోయిన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సినిమాలో ఐదు పాటలుంటే.. అందులో హీరోయిన్‌తో నాలుగు ఉన్నాయి. జవాన్‌లో కిక్కు లేదు. జవాన్‌గా సాయిధరంతేజ్ రప్ఫాడించాడు. కొన్ని సన్నివేశాల్లో ఒకప్పటి చిరంజీవిని గుర్తుకు తెచ్చాడు. మెహ్రీన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. విలన్‌గా ప్రసన్న చాలా బాగా చేసాడు. మిగిలిన వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.