ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ప్రారంభంకాక మునుపే మ్యాచ్‌ల కోసం నిధులను కేటాయించేందుకు సీఓఏ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గురువారం సీఓఏ ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు నిధులు విడుదల చేసింది. సాధారణంగా ఒక ఐపీఎల్ మ్యాచ్‌కు రూ.60లక్షల వరకు నిధులను విడుదల చేస్తారు. అయితే ఈసారి ఈ మొత్తంలో రూ.30లక్షలను ముందుగానే ఫ్రాంచైజీలకు బీసీసీఐ విడుదల చేయొచ్చునని సీఓఏ తెలిపింది.
ఢిల్లీ, కర్ణాటక, ముంబై, మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్, యూపీ, హైదరాబాద్, సౌరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు చెందిన ప్రతినిధుల సమక్షంలో జరిగిన సీఓఏ సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు విడుదల చేసే నిధులపై కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.