కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన భార్య తనను చంపేస్తుందేమోనని తెలిపాడు. భార్య నటాషా గంభీర్‌ను ఎన్నోసార్లు తనతో పాటు డ్యాన్స్ చేయాలని కోరిందని.. అయితే వాటిని గంభీర్ ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదని గంభీర్ వ్యాఖ్యానించాడు. చివరికి అతడి బావమరిది.. బ్యాచిలర్ పార్టీ వేడుకల్లోనూ డ్యాన్స్ చేయలేదని.. ఇది నేరంతో సమానమని చెప్పినట్లు గంభీర్ తెలిపాడు.
షారూఖ్ సైతం గౌతం గంభీర్‌ను డ్యాన్స్ చేయమని కోరేవాడని.. కానీ ఓ ప్రకటన కోసం తొలిసారి గంభీర్ కాలు కదిపాడు. ఎన్నోసార్లు బతిమాలినా ఒప్పుకోని తాను ప్రస్తుతం డ్యాన్స్ చేసే సరికి నటాషా తనను చంపేస్తుందేమోనని గంభీర్ చమత్కరించాడు. గంభీర్ చాలా అరుదుగా నవ్వుతుంటాడు. మైదానంలో ఉన్నా.. భార్యతో గడుపుతున్నా ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తాడనే విషయం తెలిసిందే.