ఐపీఎల్ సీజన్ 10లో 4వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడటంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆది నుంచి కాస్త దూకుడుగా ఆడింది. హాషీమ్ ఆమ్లా 28 పరుగులు, వోహ్రా 14, సాహా 14, పటేల్ 24 పరుగులు చేశారు. మ్యాక్స్వెల్ 44 పరుగులు, మిల్లర్ 30 పరుగుల మెరుపు షాట్లతో కింగ్స్ లెవన్ మరో ఓవర్ వుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకుముందు బ్యాటింగుకు దిగిన పూణె సూపర్ జెయింట్ అంతగా రాణించలేకోపయింది. రహానే 19 పరుగులు, మయాంఖ్ అగర్వాల్ 0, స్టీవ్ స్మిత్ 26 పరుగులు, బెన్ స్టోక్స్ 50 పరుగులు, ధోనీ 5 పరుగులు చేశారు. మనోజ్ తివారీ 40 పరుగులు, క్రిస్టియన్ 17 పరుగులు చేశారు. దీనితో పూణే 163 పరుగులు చేసింది.