ఐపీఎల్ పదో సీజన్‌కు కూడా రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా కొనసాగుతారు: వినోద్ రాయ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌కు కూడా రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా కొనసాగుతారని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. రాజీవ్ శుక్లాను ఐపీఎల్ నుంచి తప్పించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
ఐపీఎల్‌ను ఇంతవరకు సమర్థవంతంగా నిర్వహించిన రాజీవ్‌నే ఈ ఏడాది కూడా ఛైర్మన్ కొనసాగించనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ కొత్త సారథి లభించేంతవరకు రాజీవ్ శుక్లానే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.
కాగా సీఓఏ కమిటీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను పర్యవేక్షిస్తోంది. తొలి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ త్వరలో జరుగనుందని వినోద్ చెప్పుకొచ్చారు. అదే జరిగితే సీఓఏ కనుసన్నల్లో జరిగే తొలి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇదే అవుతుంది.