టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లాంటి క్రికెటర్ జట్టులో ఉండటం రైజింగ్ పూణే జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు అదృష్టమని మాజీ స్టార్ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. సారథిగా జట్టును నడిపించిన ధోనీ ప్రస్తుతం మరొకరి ఆదేశాలను పాటించనున్నప్పటికీ.. ఈ సీజన్లో సాధారణ ఆటగాడిగానే కనిపిస్తాడని తెలిపాడు. కానీ అత్యుత్తమ ఫినిషర్ అయిన ధోనీ తప్పకుండా మ్యాచ్‌ను మలుపు తిప్పగలిగే సమర్థుడని కొనియాడాడు.