ఐపీఎల్‌లో హైదరాబాద్ మరో ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఆధిపత్యం చాటుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో కీలక మ్యాచ్‌లో సన రైజర్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్, చెన్నై తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా కోల్‌కతా నిలిచింది. ఇక ఐపీఎల్ 11వ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచిన హైదరాబాద్ లీగ్ దశను ఓటమితో ముగించింది.
ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా ఓపెనర్ క్రిస్ లిన్ (55 పరుగులు, 43 బంతుల్లో), రాబిన్ ఉతప్ప (34 బంతుల్లో 45 పరుగులు సాధించారు. దీంతో మరో 2 బంతులుండగానే కోల్‌కతా విజయం సాధించింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (26), సునీల్ నరైన్ (29) రాణించారు.
అంతకముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ సొంతగడ్డపై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (50, 39బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. వికెట్ కీపర్ గోస్వామి (35), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 36 పరుగులు) రాణించారు.