''మన్కడ్‌''కు మద్దతు.. క్రీజ్ దాటితే అవుట్ చేయొచ్చు.. హెచ్చరించనక్కర్లేదు..

బుధవారం, 27 మార్చి 2019 (14:17 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్‌లో భాగంగా రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాను బాల్ వేయకముందే జోస్ బట్లర్ క్రీజ్ దాటాడనే కారణంతో మన్కడింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్‌కు క్రికెట్ నిబంధనల సృష్టించిన మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ అండగా నిలిచింది. ఇందులో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
ఇందులో భాగంగా 'మన్కడింగ్' నిబంధన తప్పనిసరని, ఆటలో భాగమేనని స్పష్టం చేస్తూ రూలింగ్ ఇచ్చింది. బ్యాట్స్‌మెన్ క్రీజ్ దాటితే ఓసారి హెచ్చరించే ప్రక్రియ కూడా ఎక్కడా లేదని పేర్కొంది. ఈ పద్ధతిలో ఓ ఆటగాడిని అవుట్ చేయడం నిబంధనలకు అనుగుణంగా జరిగేదేనని స్పష్టం చేసింది. బాల్ వేయకముందు క్రీజ్ దాటరాదన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని, దాటితే అవుట్ చేయవచ్చని స్పష్టం చేసింది. 
 
ఇదే నిబంధన లేకుంటే, నాన్ స్ట్రయికర్ బ్యాట్స్‌మన్ బాల్ వేయకముందే క్రీజ్‌ను దాటి చాలాదూరం వెళ్లిపోయే ప్రమాదం వుంటుందని.. మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ వెల్లడించింది. ఆటగాడు పిచ్ మధ్య వరకూ వెళ్లి నిలుచుంటే ఎలాగని ప్రశ్నించింది. ఈ తరహా ఔట్‌పై క్రికెట్ నిబంధనల చట్టంలోని 41.16 నిబంధన స్పష్టంగా ఉందని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు