అంతేకాకుండా, ఫిబ్రవరి 26వ తేదీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోలి జైషే మొహమ్మద్ ఉగ్ర తండాలపై భారత వైమానిక దళం చేపట్టిన వైమానిక దాడులపైనా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. వైమానిక దాడులపై కొన్ని విదేశీ మీడియా సంస్థలు సందేహాలు వ్యక్తం చేశాయనీ... భారత ప్రభుత్వ విశ్వసనీయతపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
మంగళవారం దిగ్విజయ్ సింగ్ హిందీలో చేసిన ట్వీట్‌లో స్పందిస్తూ, 'ఏదేమైనా, పుల్వామా "దుర్ఘటన" తర్వాత ఐఏఎఫ్ నిర్వహించిన వైమానిక దాడులపై కొన్ని విదేశీ మీడియా సంస్థలు "సందేహాలు" వ్యక్తం చేస్తున్నాయి. ఇది మన భారత ప్రభుత్వ "విశ్వసనీయత"పై’ ప్రశ్నలు లేవనెత్తుతోంది...' అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిని 'ప్రమాదం'గా పేర్కొనడాన్ని తప్పుపడుతూ నెటిజన్లు దిగ్విజయ్ సింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా, భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడుల్లో ఎంతమంది తీవ్రవాదులు చనిపోయారన్న అంశంపై ఇప్పటివరకు కేంద్రం స్పష్టంచేయలేదని గుర్తుచేసిన డిగ్గీరాజా... '250 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామంటూ బీజేపీ చీఫ్ అమిత్ షా, 400 మందిని చంపామంటూ యూపీ సీఎం యోగి, ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్రమంత్రి అహ్లూవాలియా' చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.