రోహిత్‌ను కెప్టెన్ చేయండి.. చెప్పిందెవరంటే?

బుధవారం, 11 నవంబరు 2020 (13:01 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 13వ సీజన్ ముగిసిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ టోర్నీని ముంబై ఇండియన్స్ జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఐదోసారి ఆ టైటిల్‌ను ముంబై టీమ్ సొంతం చేసుకుంది. అత్యద్భుత ఆటతీరును కనబరిచిన ముంబై సారథి రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ బెస్ట్ కెప్టెన్ అని మాజీ టీమిండియా క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
 
ప్రపంచంలోనే ఇది ఉత్తమ టీ20 ఫ్రాంచైజీ అని, రోహిత్ బెస్ట్ కెప్టెన్ అని, ముంబై టోర్నీ గెలవడంలో సందేహం లేదని, అనేక సవాళ్లు ఉన్నా.. టోర్నీని అద్భుతంగా నిర్వహించారని సెహ్వాగ్ కితాబిచ్చాడు. 
 
ఇకపోతే.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ కూడా రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా జట్టుకు రోహిత్‌ను కెప్టెన్ చేయాలని వాన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్‌ను కెప్టెన్ చేయడం వల్ల.. కోహ్లీపై భారం తగ్గుతుందని, అతను వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్సీ చూసుకుంటాడని అన్నాడు. రోహిత్ ఓ అద్భుతమైన మేనేజర్, సారథి అని, టీ20లు గెలవడం అతనికి తెలుసు అని వాన్ తన ట్వీట్‌లో తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు