అయితే మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కి దూరం కానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ధోని వయసు దాదాపు 40గా ఉండటంతో ఐపీఎల్‌కు దూరమవుతున్నాడని.. ఇంకా ధోని వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే అతను ఐపీఎల్‌కి దూరం అయ్యే అవకాశం ఉంది అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
ధోనీ ఇటీవల ఒక భూ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని సమాచారం దీనితో ధోనీ ఐపీఎల్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ సమస్య వచ్చింది అని, అది పరిష్కారం అయ్యే విధంగా లేదు అని కాబట్టి ఐపిఎల్‌లో ధోని కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు.