ప్రియురాలితో హ్యాపీగా వుండాలని వెళ్లాడు.. కానీ ఆత్మహత్య..?

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:40 IST)
సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతూ వున్నాయి. తద్వారా నేరాల సంఖ్య కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ప్రియురాలితో గడపడానికి వెళ్లని ఓ వ్యక్తి ఆమె ఇంట్లోనే ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఇంట్లోని ఓ రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోటా, మహావీర్ నగర్ చెందిన 32 ఏళ్ల కుల్దీప్ శర్మకు ఇదివరకే పెళ్లి అయింది. భార్యతో కలిసి మహావీర్‌నగర్‌లోనే నివాసం ఉంటున్నాడు. అయితే ఉద్యోగ్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ రెసిడెన్షియల్ స్కీమ్‌లో నివాసం ఉండే మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఉద్యోగ్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ రెసిడెన్షియల్ స్కీమ్‌లో నివాసం ఉండే మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. 
 
ఈ క్రమంలోనే తరుచూ ఆమె ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా కుల్దీప్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కుల్దీప్‌కు తన ప్రియురాలుకు మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆ ఇంట్లోనే కుల్దీప్ వేరే గదిలో పడుకున్నాడు. అయితే శనివారం చూసేసరికి ప్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె కుల్దీప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే అతడు మరణించినట్టుగా వైద్యులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు