ఐపీఎల్‌లో కలకలం : రాజస్థాన్ ఫీల్డింగ్ కోచ్‌కు కరోనా పాజిటివ్ (Video)

బుధవారం, 12 ఆగస్టు 2020 (14:44 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కలకలం చెలరేగింది. ఐపీఎల్ ప్రాంఛైజీల్లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఫీల్డింగ్ కోచ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా దిశాంత్ యాగ్నిక్ కొనసాగుతున్నారు. ఈయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను 14 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. యాగ్నిక్‌తో కలిసి పనిచేసిన అందరూ కరోనా టెస్టులు చేయించుకుని ఐసోలేషన్‌లో ఉండాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కోరింది.
 
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ వేలాది సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఐపీఎల్ పోటీలు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. దీంతో వచ్చే నెల 19వ తేదీ నుంచి నవంబరు 10వ తేదీ వరకు ఈ పోటీలు దుబాయ్ వేదికగా జరుగనున్నాయి. నిజానికి ఈ పోటీలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అలా పర్మిషన్ ఇచ్చిన 48 గంటల్లోనే ఐపీఎల్ ప్రాంఛైజీ జట్లలో కరోనా కలకలం రేగడం గమనార్హం. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు