మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్ 45, డేవిడ్ 44, రోహిత్ శర్మ 43 పరుగులతో రాణించారు. 178 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు సాహా, గిల్ తొలి వికెట్‌కు 106 పరుగుల ఫ్లయింగ్‌స్టార్ట్ ఇచ్చారు.
చివరి రోవర్ వరకు విజయం గుజరాత్‌దే అన్నట్లుగా మ్యాచ్ సాగింది. క్రీజ్‌లో ఫామ్‌లో ఉన్న మిల్లర్, తేవాటియా ఉన్నా సామ్స్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై విజయంలో కీ రోల్ పోషించాడు.