కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం పురుషుల టోర్నీగా అదరగొడుతోంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో మహిళల విభాగంలోనూ ఈ టోర్నీ జరగాలని టీమిండియా మహిళల వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. పురుషులంత కాకపోయినా పరిమిత స్థాయిలోనైనా వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ ప్రారంభించాలని కోరింది.
దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ మంది క్రికెటర్లు లేరనే విషయం తనకు తెలుసునని.. కానీ ఇప్పుడున్న ఫ్రాంఛైజీలు ఐదు లేదా ఆరు కొత్త జట్లను తయారు చేస్తే సరిపోతుందని చెప్పింది. ఎలాగూ బీసీసీఐ వద్ద నాలుగు జట్లున్నాయి. బీసీసీఐ ఎల్లకాలం ఈ విషయంలో వేచి చూడొద్దని.. ఏదో ఒక సందర్భంలో ముందడుగు వేయాలని మిథాలీ విజ్ఞప్తి చేసింది.